Show-Cause Notices | జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం..76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
Show-Cause Notices | జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో ఒకేసారి 76 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
గద్వాల: జోగులాంబ గద్వాల (Gadwal ) జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో ఒకేసారి 76 మందికి షోకాజ్ నోటీసులు ( Show-Cause Notices ) జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నైజ్ సిస్టం హాజరు విధానం సక్రమంగా నిర్వహించకపోవడంతో 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్( Collector Rizwan Basha) తెలిపారు.
గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అమలవుతున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించగా పలుచోట్ల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎఫ్.ఆర్.ఎస్ యాప్‌లో హాజరు సక్రమంగా నమోదు చేయకపోవడాన్ని గమనించినట్లు వివరించారు. సంబంధిత సిబ్బంది తమ సంజాయిషీని మూడు రోజుల లోపు సమర్పించాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను కచ్చితంగా పాటించడంతో పాటు, ప్రతి రోజూ ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా హాజరును తప్పనిసరిగా సమయానికి నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

