హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యువత డబ్బింగ్(Dubbing) రంగంలో శిక్షణ పొంది సినిమా రంగంలో(Cine industry) రాణించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ(Mamidi Harikrishna) అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరి సంస్థ నిర్వహిస్తున్న డబ్బింగ్ శిక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్(Wall poster)ను గురువారం రవీంద్రభారతిలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు.
నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో 45 రోజుల పాటు డబ్బింగ్ శిక్షణా కార్యక్రమం ఉంటుందని సంస్థ నిర్వహకుడు రమేశ్ కిషన్‌గౌడ్ తెలిపారు. ఈ శిక్షణలో డబ్బింగ్లో తర్పీదు పొంది డబ్బింగ్ కళాకారులుగా రాణించాలని సూచించారు. ఇప్పుడు సీజన్ -5 డబ్బింగ్ వాయిస్ యాక్టింగ్,వాయిస్ ఓవర్‌తో ముందుకు వచ్చామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్న యువతి,యువకులు ఏప్రిల్ 10వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు ఫోన్ 7396817623ను సంప్రదించాలన్నారు.