స్కూళ్లల్లో టాయిలెట్ల కొరత
ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో దూసుకుపోతున్న తరు ణంలో ఇంకా విద్యార్థులు ఒంటి.. రెంటికి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.
- 17% బడుల్లో బాలురకు.. 9% బడుల్లో బాలికలకు నో టాయిలెట్స్
- 14% బడుల్లో ఆటస్థలాల కరువు
- సోషియో ఎకనమిక్ సర్వే వెల్లడి
హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో దూసుకుపోతున్న తరు ణంలో ఇంకా విద్యార్థులు ఒంటి.. రెంటికి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొన్నది. తాజా బడ్జెట్లో రూ.26వేల కోట్ల కేటాయించడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలోని స్కూళ్లల్లో 17% బడుల్లో బాలురకు.. 9% బడుల్లో బాలికలకు టాయిలెట్లు లేవు. ఈ విషయం సోషియో ఎకనమిక్ ఔట్లుక్-2026లో వెల్లడైంది. బడ్జెట్ సందర్భంగా ఈ నివేదికను సర్కార్ అసెంబ్లీకి సమర్పించగా, పలు ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి మొత్తం 39,641 స్కూళ్లున్నాయి. వీటిలో 62.36లక్షల విద్యార్థులు ఉన్నా రు. పలు బడుల్లో వసతుల్లేవని తేల్చింది.
ప్రైవేట్‌తో పోల్చితే సర్కార్‌లో సగమే..
రాష్ట్రంలోని సర్కార్ బడులు రానురాను నిర్వీర్యమవుతున్నాయి. ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గుతున్నది. గణాంకాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ బడుల్లోని వి ద్యార్థుల సంఖ్యలో సగం కూడా సర్కార్ బడుల్లో లేవు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,689 ఉండగా, వీటిల్లో ఏకంగా 37,43,893గా ఉంది. అంటే ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య తక్కువగా ఉండగా, ఎన్రోల్మెంట్ అధికంగా ఉంది. అదే సర్కార్ బడుల సంఖ్య ఎక్కువగా ఉండగా, ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉన్నది.
మరికొన్ని విషయాలిలా..
- 5% బడులకు విద్యుత్తు కనెక్షన్లు లేవు.
- డిజిటల్ లైబ్రరీ లేని బడులు 15%
- 14% బడుల్లో ఆటస్థలాలు లేవు.
- వినియోగంలో గల కంప్యూటర్లున్న బ డులు 81.2%. అంటే 19% బడుల్లో వినియోగంలో ఉన్నవి లేవన్న మాట.
- సెకండరీ విద్యలో స్థూల నమోదు ని ష్పత్తి తగ్గుతున్నది. బాలుర నమోదు 80.6, బాలికల నమోదు 86.8%.
- ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక తరగతుల్లో 10శాతమే. అంటే 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నా రు. మిడిల్ స్కూల్లో 12, సెకండరీలో 13మందికి ఒక టీచర్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

