Dalit Bandhu | నేడు శాసనసభలో దళితబంధుపై స్వల్పకాలిక చర్చ
Dalit Bandhu | దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై నేడు శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే దళిత బంధుపై స్వల్పకాలిక

హైదరాబాద్ : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై నేడు శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే దళిత బంధుపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం ఈ పథకంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇవ్వనున్నారు.
మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధిపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, టౌటింగ్ చట్టం బిల్లుపై కూడా మండలిలో చర్చించనున్నారు. ఈ రెండు బిల్లులకు నిన్న శాసనసభ ఆమోదం తెలిపింది.
శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా తలసరి విద్యుత్ వినియోగం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఆరోగ్య లక్ష్మి అమలు, చెక్‌డ్యాంల నిర్మాణం, ఆరోగ్య వివరాల రికార్డులు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై చర్చించనున్నారు.
మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మెగా డెయిరీ ప్రాజెక్టుల ఏర్పాటు, కళాకారులకు పింఛను చెల్లింపు, జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఎన్డీపీ అభివృద్ధి కార్యక్రమం, పారిశ్రామిక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై చర్చించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

