Minister Srinivas Yadav | ఈ నెల 9 నుంచి రెండో విడతల గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మొదట 5వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించామని, అనివార్య కారణాలతో 9వ తేదీకి మార్చినట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీపై మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభాలని నిర్ణయించినట్లు చెప్పారు.
లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చే గొర్రెలకు అవసరమైన మందులు, దాణా, ఇన్సూరెన్స్ ట్యాగ్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నిర్వహించే ఫిష్ పుడ్ ఫెస్టివల్ 8న ప్రారంభించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాల్లో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ స్టాల్స్‌ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.