ఆత్మకూరు, సెప్టెంబర్ 3 : హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య (12) డెంగ్యూతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యు ల వివరాల మేరకు.. శ్రీనిత్య కు టుంబం ప్రస్తుతం వరంగల్లో నివాసం ఉం టుండగా అక్కడే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నది. వారం రోజులుగా జ్వరం వస్తుండగా, రెండు రోజుల క్రితం తీవ్రమైంది. వెంటనే ఆమె తల్లి సునీత పాపను హనుమకొండలోని దవాఖానలో చేర్పించగా డెంగ్యూ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగానే మంగళవారం మృతి చెందినట్టు ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : పోస్టల్ డిపార్ట్మెంట్లో రూ.1.72 కోట్లు కాజేసిన ఉద్యోగి కేసరి సతీశ్, అతని బంధువు దువ్వా వీరేశ్కుమార్పై ఈడీ నాంపల్లి కోర్టులో పీఎంఎల్ఏ చట్టం కింద అభియోగాలు మోపింది. వరంగల్ పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ పరిధిలోని కొడకండ్లలో సబ్ పోస్టమాస్టర్గా పనిచేసిన సమయంలో సతీశ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కేసు నమోదు అయ్యింది.