హైదరాబాద్ : రాష్ట్రంలోకులగణన(Caste census) చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో జనాభా ప్రాదిపదిన కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.ఈ విషయంలో గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు. జనాభాలో ప్రస్తుతం 42 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. అందుకే కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Letter