హనుమకొండ, డిసెంబర్ 9 : తమ జోలికొస్తే ఊరుకునేదిలేదని వెలమ సంక్షేమ సంఘం నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను హెచ్చరించారు. సో మవారం ఎమ్మెల్యే శంకరయ్య వెలమలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలాపా ర్కు ఎదుట ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వ చ్చి ఎమ్మెల్యే శంకరయ్య దిష్టిబొమ్మ దహ నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రావు, ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే శంకరయ్య క్షమాపణ చెప్పకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సం ఘ నాయకులు బోయినపల్లి రంజిత్‌రావు, తక్కళ్లపల్లి రవీందర్రావు, కేశవరావు, వెంకటేశ్వర్రావు, దుర్గారావు, ఉపేందర్‌రావు, దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.