శంషాబాద్ రూరల్, ఆగస్టు 13: డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో 931 గ్రాముల బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియా నుంచి షేక్ ఖాజా రహెమతుల్లా, షేక్ జానిపాషా ఆదివారం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
వీరు అక్కడి నుంచి నేరుగా కారు పార్కింగ్‌లోకి వచ్చేందుకు యత్నించగా, సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వారిని తనిఖీ చేయగా, బంగారం దొరికింది. దాని విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు.