అలా మాట్లాడటానికి సిగ్గుండాలి : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathod | బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్‌ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.

జయశంకర్ భూపాలపల్లి : బీజేపీ పాలిత తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారు. అలాంటి పథకాలు మాకు అమలుచేయండి. లేకపోతే తెలంగాణలో మమ్మల్ని కలపండి అంటుంటే బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్‌ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.
జిల్లాలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు బంధు పథకం అద్భుమన్నారు. దాదాపు 500 మంది మహిళలు ఈరోజు ఈ ముత్యాల ముగ్గు పోటీల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అన్నారు. రైతు బంధు ప్రవేశ పెట్టినప్పటి నుంచి 8వా దఫాలలో 50 వేల కోట్ల రూపాయలు ఒక్క పథకం ద్వారా రైతుల ఖాతాల్లో వేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.

రైతు చనిపోతే బీమా పథకం పెట్టారు. 5 లక్షల రూపాయలు పెద్ద ఖర్మ ముందే వారి అకౌంట్స్ లో పడుతున్నాయి. ఇంత చేస్తున్నా బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో వలె మాకు సంక్షేమ పథకాలు పెట్టండి..లేకపోతే తెలంగాణలో కలపండి అని డిమాండ్ చేస్తూంటే వారికి ఏమి సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నించారు.
బండి సంజయ్ 10 సార్లు జైలుకు వెళ్లావు. అయినా నీ తీరు మారలేదు. నోరు అదుపులో లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నావు . రైతు కడుపు మండితే ప్రధానికి పట్టిన గతి బీజేపీకి పడుతుందన్నారు. తెలంగాణ బీజేపీ నాయకుల్లారా మీకు ఈ గతి పట్టకుండా చూసుకోండని హితవు పలికారు.
అనంతరం పోటీల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికలు, చీరలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

