హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీరు మారడం లేదనే విమర్శులు వస్తున్నాయి. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ బుధవారం సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి ‘ఏయ్ ఊర్కో..’ అంటూ దబాయించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చూపుడువేలు చూపిస్తూ.. ‘ఏయ్ ఊర్కోండి.. ఏం జేస్తరు? ఏంజేస్తరు?’ అంటూ ముందుకు వచ్చారు. ఉదయం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా.. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రన్నింగ్ కామెంట్రీ చేస్తూనే ఉన్నారు.