Guest Faculty | షాద్నగర్ టౌన్, జూలై 19 : షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, సెరికల్చర్, తెలుగు, జువాలజీ బోధించేందుకు గాను అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్-2, కంప్యూటర్ సైన్స్, సెరికల్చర్, తెలుగు, జువాలజీ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఒక్కొక్క పోస్టు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అతిథి అధ్యాపకుల పోస్టులకు గాను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో సంబంధిత సబ్జెక్టులో 50శాతం, ఇతరులు 55శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అదే విధంగా పీహెచ్డీ, నెట్, స్లెట్, సెట్ అర్హత కలిగి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న మౌఖికక పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.