హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రానున్న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాశారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు రాష్ట్రంలో 80 శాతం ఉన్నారని, వారిని ఓటు హక్కుకు దూరంగా ఉంచడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 171వ ఆర్టికల్ ప్రకారం ఏర్పడిన మండలిలో తమ సమస్యలు పరిషరించుకొనుటకు ప్రతి ఉపాధ్యాయుడికి ఓటు హకు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ స్థానానికి ప్రతి పట్టభద్రుడికి ఉన్నట్టే ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రతి ఉపాధ్యాయుడికి ఓటు హకు ఉండాలని తెలిపారు.