హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విదేశీ వర్సిటీలను అనుమతించవద్దని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ వర్సిటీలను అనుమతించే నిర్ణయా న్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది.
ఈ మేరకు సంఘం ప్రతినిధులు శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఓయూ, కాకతీయ వంటి వర్సిటీలను ప్రపంచస్థాయి వర్సిటీలతో పోటీపడేలా చేస్తామని, ఇప్పుడు విదేశీ వర్సిటీలను అనుమతించడమంటే కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడమే అవుతుందని ఆక్షేపించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజినీకాంత్, ప్రధాన కార్యదర్శి టీ నాగరాజు తదితరులు ఉన్నారు.