హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ) : అందాల పోటీలపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం యూరియా సరఫరాపై అశ్రద్ధ చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఉలుకూపలుకూ లేదని మంగళవారం ఎక్స్‌వేదికగా దుయ్యబట్టారు.
యూరియా కోసం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి(బీ) సింగిల్ విండో వద్ద, పల్లి (కే) గ్రామస్థుల అవస్థలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీలో క్యూలో నిల్చున్న రైతులు, కామారెడ్డి జిల్లా గాంధారిలో బైఠాయించిన రైతులు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో బారులు తీరిన రైతుల చిత్రాలే సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని మండిపడ్డారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. యూరియా కోసం బారులు తీరాల్సిన పరిస్థితులను మళ్లీ తెచ్చింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో యూరియా కోసం రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్టుచేశారు.