హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మొంథా తుఫాన్ (Cyclone Montha) ప్రభావం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతోపాటు కొన్ని రైళ్లను సైతం దారి మళ్లించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ (SCR) జనరల్ మేనేజర్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్- డోర్నకల్- ఖమ్మం సెక్షన్ల మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎస్సీఆర్ జోన్ మీదుగా నడపాల్సిన పలు రైలు సర్వీసులు, రైళ్ల రాకపోకలలో మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. రైలు సర్వీసుల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్ వంటి మార్పుల గురించి టికెట్లు రిజర్వ్ చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తారు. రైల్ వన్, ఐఆర్సీటీసీ, ఎన్టీఈఎస్ మొదలైన అధికృత యాప్లు, వెబ్సైట్ల నుంచి రైళ్ల తాజా సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు.. లేదా రైళ్ల సమాచారం కోసం 139కి డయల్ చేయవచ్చు. రైల్వే డివిజన్లవారీగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
డివిజన్ / స్టేషన్లు హెల్ప్ డెస్ నంబర్