మహబూబ్నగర్ : నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలిం చాడని ఓ పన్నేండ్ల బాలుడు (Seventh class student) అత్మహత్య(Commits suicide)చేసుకున్నాడు. ఈ హృదయవిదారకర సంఘటన కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కల్వకుర్తి పట్టణానికి చెందిన యశ్వంత్ (12) 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం యశ్వంత్ తండ్రి నీటి సంపు శుద్ధి చేస్తుండగా యశ్వంత్ నీటి సంపులో దిగడంతో వద్దని మందలించాడు.
దీంతో మనస్థాపం చెందిన బాలుడు ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తమతో ఉన్న కొడుకు కండ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Konatham Dileep | రేవంత్ సర్కార్ మరో దౌర్జన్యకాండ.. కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్
Jagadish Reddy | అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరు : జగదీష్ రెడ్డి