బండ్లగూడ, ఏప్రిల్ 3 : మీరాలం చెరువు వద్ద ఓ బాలుడిని గుర్తు తెలియ ని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలో గురువారం ఉదయం వాకింగ్ కోసం వచ్చిన కొంతమంది అక్కడ బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు బాలుడి ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో హసన్నగర్కు చెందిన సిమ్లాన్ అనే వ్యక్తి అది తన కొడుకు మహమ్మద్ రహీం (15) మృతదేహమేనని గుర్తించి ఘటనాస్థలం వద్దకు వచ్చి గుండెలు బాదుకుంటూ రోదించాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.