హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీ ర్మానం చేసి కేంద్రానికి పంపాలని తెలిపా రు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం లంబాడీల గర్జన సభ నిర్వహించారు. రాంబల్ నాయక్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించి సెలవు దినం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లంబాడీలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మిట్టు నాయక్, దసరం నాయక్, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, రాజునాయక్, లక్ష్మణ్‌నాయక్, చందునాయక్, మోహన్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.