హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తేతెలంగాణ) : భారతీయ జనతా పార్టీకి తెలంగాణపై తీవ్రమైన ద్వేషం ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేంద్రం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో నిధులు కేటాయించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతలు పంచడం తప్పా అభివృద్ధికి నిధులు తేవడం చేతగాదని దెప్పిపొడిచారు. రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు కేటాయించేలా చూడాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా పోటీచేస్తున్న పూల రవీందర్‌కు మ రో రెండు సంఘాలు మద్దతు పలికా యి. రవీందర్ గెలుపునకు కృషిచేస్తామని టీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు హరికిషన్, శ్రీనివాస్ నా యక్, బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ యాదగిరి, ఈ రవీందర్ వెల్లడించారు.