హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతోనే స్వరాష్ట్ర కల సాకారమైందని స్పష్టంచేశారు.
దేశంలోని అన్ని పార్టీలను సమీకరించి, ప్రజల్లో చైతన్యం నింపి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కీర్తించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అన్నిరంగాల్లో దేశానికే తలమానికంగా నిలిపారని కొనియాడారు.