హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ కోసం పనిచేస్తున్న కోవర్టులు ఒకరో ఇద్దరో తమ పార్టీలో కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆపరేషన్లో భాగంగా కోవర్టులు పనిచేస్తున్నారని అన్నారు. కోవర్టుతనం చరిత్రలోనే ఉన్నదని, ఎవరేం చేయగలరని నిర్వేదం వ్యక్తం చేశారు. కోవర్టులకు స్క్రిప్ట్తోపాటు ప్యాకేజీ వస్తుందని, ఆ ప్యాకేజీ తీసుకొని వారు స్క్రిప్ట్ చదువుతారని ఆరోపించారు.