హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తా ను వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు తెలంగాణ గడ్డపై నుంచే రాష్ట్ర విభజన వద్దని తాను చెప్పినట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో రాష్ట్ర విభజనకు చంద్రబాబు, జగన్ అనుకూలంగా లేఖ లు ఇచ్చారని, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలకు ఆనాటి నిర్ణయాలే పునాది అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాం ట్ విషయంలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘విశాఖ ఉక్కు.. ఆం ధ్రుల హక్కు’ అని స్పష్టంచేశారు. ఏపీ, తెలంగాణ జలవివాదాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై మాట్లాడేందుకు జగ్గారెడ్డి నిరాకరించడం గమనార్హం. నీటి పంపకాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతారని సమాధానాన్ని దాటవేశారు.