Congress | హైదరాబాద్, డిసెంబర్08 (నమస్తే తెలంగాణ): ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పుడు పునరంకిత సభలు పెటుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ అని, కానీ రాష్ట్రంలో విజయోత్సవ సభల పేరుతో వ్యక్తిగత గొప్పలు, స్వోత్కర్ష వేదికలుగా మారుస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ మంత్రి ఒకరు ముఖ్యనేతకు ఎదురు తిరిగినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇది పార్టీ పాలసీకి విరుద్ధ్దమని తెగేసి చెప్పినట్టు సమాచారం. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో పునరంకిత సభలు పెట్టారని.. ఆ సంస్కృతిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారని ఆయన గుర్తు చేసినట్టు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలసింది. ఈ మేరకు ఇటీవల ఓ జిల్లాలో జరిగిన బహిరంగ సభ అనంతరం సీనియర్ మంత్రి తన అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనా వైఫల్యాలపై ఆత్మ విమర్శ చేసుకుంటూ.. సాధించిన విజయాలను ప్రజలకు చెప్పుకుంటూ, ఇందిరమ్మ స్ఫూర్తితో మరింత మెరుగైన పాలనకు దిశానిర్దేశం చేసుకోవటం కోసం పునరంకిత సభలు జరుగుతాయని సదరు మంత్రి గుర్తు చేసినట్టు తెలిసింది. ఆ దిశగా ఇప్పటి వరకు ఒక్క సభ కూడా జరుగలేదని, కేవలం వ్యక్తి ప్రాధాన్య సభలు మాత్రమే జరుగుతున్నాయని, దేవుండ్ల మీద ఒట్లు, కేసీఆర్‌కు తిట్లు అన్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీని, భవిష్యత్త్తు పరిపాలనను పరిపుష్టి చేసుకునే విధంగా ఒక్క సభ కూడా సాగలేదని ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నేతగా తాను ఇటువంటి సభలను సమర్ధించలేనని తెగేసి చెప్పినట్టు తెలిసింది.
తప్పుడు సమాచారంతో ప్రజల్లోకి వెళ్లలేం
ఏడాది పాలన ప్రగతి నివేదికలు రూపొందించటంపై కూడా సీనియర్ మంత్రులు తమ సహాయ నిరాకరణ తెలియ చేసినట్టుగా తెలుస్తోంది. ఏడాది పాలనలో ఏమి అభివృద్ధి సాధించామని ప్రగతి నివేదికలు తయారు చేయాలని, తప్పుడు సమాచారంతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టులను తీసుకొని ప్రజల్లోకి వెళ్లి అభాసుపాలు కాలేమని ఐదుగురు సీనియర్ మంత్రులు తెగేసి చెప్పినట్టు నిర్దిష్టంగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న వ్యవసాయశాఖ నుంచి ఇప్పటి వరకు ప్రగతి నివేదిక బహిర్గతం కాకపోవటంతో ముఖ్యనేత, సీనియర్ మంత్రుల మధ్య సంవాదం జరిగిందనే వాదనకు బలాన్నిస్తోంది. ఈ మేరకు ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చేసిన ఖర్చు తదితర సమగ్ర వివరాలతో ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేయాలని సూచలిచ్చినట్టు సమాచారం.
విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చే విధంగా ప్రోగ్రెస్ రిపోర్టు ఉండాలని ముఖ్య నేత దిశానిర్దేశం చేసినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తున్న వ్యవసాయం, సివిల్ సైప్లె, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలకు చెందిన మంత్రులు ప్రగతి నివేదికలు ఇవ్వటానికి ఇప్పటి వరకు ముందకు రాలేదు. రూ 2 లక్షల రుణ మాఫీ పూర్తి అయిందని ప్రభుత్వం ప్రకటించగా.. తమకు రుణమాఫీ కాలేదంటు వేల కొద్ది రైతు కుటంబాలు రోడ్డెక్కుతున్నాయి. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, రైతు భరోసా మీద ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్న నేపధ్యంలో ప్రగతి నివేదికలు ఎలా ఇవ్వాలని సదరు శాఖ మంత్రి ముఖ్యనేత వద్ద తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఉడికిపోతున్న ఉత్తమ్
నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల నుంచి ఇప్పటి వరకు ప్రగతి నివేదికలు బహిర్గతం చేయలేదు. ఈ రెండు శాఖలకు ఒకే సీనియర్ మంత్రి ఉండటం గమనార్హం. సదరు మంత్రికి, ముఖ్యనేతకు మధ్య అసలు పొసగటం లేదని గాంధీభవన్ వర్గాలే చెప్తున్నాయి. ముఖ్య నేత కార్యాల యం నుంచి వచ్చే ఆదేశాలను ఆయన పెడ చెవి న పెడతారని, తన శాఖలో వేరొకరు వేలు పెట్టడానికి ఇష్టపడరనే ఆరోపణలు ఉన్నాయి. ఏడా ది పాలనలో నీటి పారుదల రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే అభిప్రాయంతో సదరు మం త్రి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం కానీ, పు రోగతిలో ఉన్న ప్రాజెక్టుకు నిధులు కేటాయించ టం కానీ చేయలేదని, కేవలం లగచర్ల పారిశ్రామిక కారిడార్‌ను దృష్టిలో పెట్టుకొని మొదలు పెట్టిన కొడంగల్ లిఫ్ట్ పనులకు మాత్రమే నిధు లు ఇవ్వటంతో సదరు శాఖ మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి విచారణకు ఆదేశించటం మిన హా.. కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేయటానికి రూపాయి నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలోతాను ఎటువంటి ప్రగతి నివేదికలు పట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాలని సదరు మంత్రి ప్రశ్నించినట్టు తెలిసింది. రోడ్లు భవనాల శాఖ నుంచి కూడా ఏడాది పాలన మీద ఇప్పటి వరకు ప్రోగ్రెస్ రిపోర్టు వెల్లడి కాలేదు. ఆ శాఖలో కొత్త గా వేసిన రోడ్లు ఏమీ లేకపోవటం, కనీసం పాత రోడ్లను రిపేర్ చేయడానికి నిధులు కేటాయించ క పోవటంతో సదరు మంత్రి ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచకుండా మొఖం చాటేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.