ఖైరతాబాద్, జూన్ 4: ‘తెలంగాణ ప్రత్యేకవాదమంటే ఉగ్రవాదం కాదని.. అది ఈ ప్రాంత ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవం. మా ఉనికికి ఎవరైనా విఘాతం కలిగిస్తే ఇక్కడి నుంచి తరిమికొడుతాం’ అని పలువురు వ క్తలు తేల్చిచెప్పారు. తెలంగాణ క్రాంతిదళ్ ఆ ధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ మరోసారి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తాము ఆంధ్రా ప్రాంతానికి, అక్కడి ప్రజలకు వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. కానీ, నేడు తెలంగాణలో మళ్లీ అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆంధ్రా వలస పాలనలో తె లంగాణ ప్రాంతం సర్వనాశనమైందని, ఇక్కడున్న ఫార్మా కంపెనీలన్నీ ఆంధ్రా ప్రాంతం వారివేనని ఆరోపించారు. బలవంతంగా ఇక్కడి పేదల భూములు లాక్కున్నారని, ఆ భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టి తెలంగాణపై అక్కసే కాదు.. విషాన్ని సైతం చిమ్ముతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ వారంటే ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత అక్కసు ఉంటుందని విమర్శించారు. మళ్లీ తెలంగాణలో అరాచకత్వం తేవాలన్న ప్ర యత్నం జరుగుతున్నందుకే తాము పోరాటాలకు సిద్ధమవుతున్నామని, ఇప్పకైనా తెలంగాణపై విషం కక్కడం మానుకోని పక్షంలో బరాబర్ కొట్లాడుతామని, ఈ యుద్దం ఇక్కడితో ఆగదని స్పష్టంచేశారు.
ప్రత్యేక రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రా వలస పాలకులే రాజ్యమేలుతున్నారని తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ విమర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు హైదరాబాద్‌కు వచ్చిన పవన్ క ల్యాణ్.. ప్రత్యేక వాదమంటే ఉగ్రవాదమని, ఇది మీ అయ్య జాగీరా? అనడం తీవ్ర అ భ్యంతరకరమని పేర్కొన్నారు. జనసేన నే తలు ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డినే బహిరంగంగా విమర్శిస్తుంటే వారిపై చర్యలు తీసుకోవడం ఆయనకు చేత కావడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో కవి, రచయిత పసునూరి రవీందర్, ప్రొఫెసర్ భాగయ్య, జర్నలిస్టు సజయ, దాసోజు లలిత పాల్గొన్నారు.