హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన న్యాయవాదితో కలిసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. భూదాన్ భూముల బదిలీకి సంబంధించి ప్రశ్నించినట్టు సమాచారం. సాయంత్రం వరకు విచారణ కొనసాగింది. గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమోయ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో 42 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.