షాబాద్, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ పార్టీ రైతుల భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని, భూములు గుంజుకోవడంలో ఈ ప్రభుత్వం ముందున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్, ఎనికెపల్లి వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతుల భూములు గుంజుకోవడంలో ఫస్ట్ ఉన్నదని విమర్శించారు. పెద్ద మంగళారం, ఎనికెపల్లిలో రైతుల భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ఎట్ల పాలన చేయాలో ముఖ్యమంత్రికి చేతకావడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ నిషానా చెరిపేయడం రేవంత్‌రెడ్డికి అంతా ఈజీ కాదని అన్నారు.