Thirumalagiri | నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ)/శాలిగౌరారం/ తిరుమలగిరి/తుంగుతుర్తి : తనకు సంబంధం లేకపోయినా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్సై తీవ్రంగా కొ ట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శనిగ నాగరాజు సూర్యాపేట జిల్లా తొండ గ్రామంలోని గొలుసుల వెంకన్న నిర్వహణలో ఉన్న బాలాజీ స్టోన్ క్రషర్ మిల్లులో టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. యజమాని వద్దనడంతో పని మానేశాడు. రెండు నెలల జీతం రావాల్సి ఉందని నాగరాజు కొద్దిరోజుల కిందట యజమానికి ఫోన్ చేశాడు. యజమాని జీతం ఇవ్వకపోగా డీజిల్ దొంగతనం జరిగిందంటూ నా గరాజుతోపాటు మరికొందరిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంకన్న స్థానిక ఎమ్మెల్యేను సైతం ఆశ్రయించి ఎస్సైకి ఫోన్ చేయించాడు.
దీంతో తిరుమలగిరి ఎస్సై వంటెపాక సురేశ్, నాగరాజుకు ఫోన్ చేస్తూ స్టేషన్కు రమ్మంటున్నాడు. తనకు సంబంధం లేదని నాగరాజు వెళ్లకపోయే సరికి బుధవా రం ఎస్సై ఫోన్ చేసి మందలించాడు. గురువా రం నాగరాజు తన బావమరిది, తమ్ముడిని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. వి చారణ పేరుతో ఎస్సై నాగరాజు, అతడి తమ్ముడిని తీవ్రంగా చితకబాది మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించి వదిలిపెట్టాడు. మనస్తాపానికి గురైన నాగరాజు శుక్రవారం ఉదయం ఆకారంలోని వ్యవసాయ భూమిలో ఓ చెట్టుకు తాడు వేసి మెడకు బిగించుకుని సెల్ఫీ వీడియాలో మాట్లాడాడు. ‘నాకు ఏ పా పమూ తెల్వదు. ఎన్నడన్న స్టేషన్కు పోయినోడిని కాదు. ఎవ్వని జోలికి కూడా పోయినోడి ని కాదు.
నన్ను ఇరికించారు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ఉరి వేసుకున్నాడు. గమనించిన కొందరు నాగరాజును కిందకు దించి దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి నల్లగొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు.. పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు తీసుకెళ్లారు. కాగా టిప్పర్ డ్రైవర్ నాగరాజు ఆత్మహత్యాయత్నానికి, తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. మిల్లు యజమాని గొలుసు వెంకన్న ఫిర్యాదు మేరకు నాగరాజును స్టేషన్కు పిలిపించి అడగ్గా.. దొంగతం చేసింది వాస్తమని అంగీకరించినట్టు ఎస్సై సురేశ్ తెలిపారు. నాగరాజును తాను కొట్టలేదని, ఎమ్మెల్యే తమకేమీ చెప్పలేదని పేర్కొన్నారు.