హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) చట్టాలను ఉల్లంఘించినవారిపై ఈ ఏడాది 573 కేసులు నమోదు చేసినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. వెంగళరావునగర్‌లోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సో మవారం ఆయన డీసీఏ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ మందుల తయారీపై 8, ఎంఆర్పీ ఉల్లంఘనలపై 79, నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలపై ప్ర కటనలు ముద్రించిన కంపెనీలపై 199, నకిలీ వైద్యులపై 136, అనుమతి లేని మెడికల్‌షాప్‌లు, ఔషధ గోదాములపై 98, ఆహార ఉత్పత్తుల ముసుగులో ఔషధాల తయారీపై 44 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించిన కంపెనీలు, మెడికల్ షాపులు, ఏజెన్సీల వద్ద నుంచి 7.46 కోట్ల విలువైన ఔషధాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలపై నిఘా పెట్టినట్టు తెలిపారు. 42 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.