హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మూడురోజులుగా కొనసాగిస్తున్న సోదాల్లో రూ.1.4 కోట్ల విలువైన అక్రమ మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. గురువారం నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో 29,663 మంది అనుమానాస్పద మద్యం విక్రేతలను బైండోవర్ చేశారు. 8,362 మందిపై నిఘా పెట్టారు. 14 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదుచేశారు. ఏపీ సరిహద్దులో 8, మహారాష్ట్ర సరిహద్దులో 8, కర్ణాటక సరిహద్దులో 4, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఒక చెక్‌పోస్టును ఎక్సైజ్‌శాఖ ఏర్పాటుచేసింది. శనివారం 14, 227 లీటర్ల ఐడీ మద్యం, 1,710 కిలోల బెల్లం, 98.4 లీటర్ల మద్యం, 170 కిలోల గంజాయి, 21 వాహనాలను ఎక్సైజ్ శాఖ స్వాధీనం సీజ్ చేసింది.