ములుగు, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్ బలయ్యాడని, ఇందుకు మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. మహేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన భిక్షాటన ద్వారా వచ్చిన రూ.1,01,016 నగదుతోపాటు క్వింటాల్ బియ్యాన్ని బుధవారం నాగజ్యోతి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాధవరావుపల్లిలో గల ఆయన కుటుంబానికి అందజేశారు. మహేశ్ కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి విరాళాలు సేకరించి వారి కుటుంబానికి అందించినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.