Seethakka | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ‘మా అటవీ ప్రాంతాలు అభివృద్ధి కావద్దా? సరైన రోడ్లు లేక మేము చీకట్లోనే మగ్గిపోవాలా?’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆవేదన వ్యక్తంచేశారు. అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే అంతరాలు పెరిగి, ఆదివాసీలు ఆదిమ మానవులగానే మిగిలిపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం సచివాలయంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మౌలిక వస్తువుల కల్పన, పనులకు అటవీశాఖ అనుమతులపై ఏర్పడిన ఇబ్బందులను పరిషరించేందుకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీతక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అటవీశాఖ కఠిన నిబంధనలతో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో సైవేలు, హైవేలు, ఆరు వరుసల రోడ్లు వస్తున్నాయని, ములుగు వంటి ప్రాంతాల్లో సింగిల్ రోడ్డు కూడా రావడం లేదని వాపోయారు. రోడ్లు లేకపోతే తమ ప్రాంతాలు ఎలా అభివృద్ధి సాధిస్తాయని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఇకడా అవే నిబంధనలను అమలు చేయాలని కోరారు.