హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల ని మంత్రి సీతక్క ఆదేశించారు. ఎర్రమంజిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈలతో జిల్లాలవారీగా తాగునీటి సరఫరాపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భగీరథ బోర్డు చైర్‌పర్సన్‌గా మంత్రి సీతక, వైస్ చైర్మన్, ఎండీగా పీఆర్ సెక్రటరీ లోకేశ్‌కుమార్, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఏయూడీ కమిషనర్ శ్రీదేవిని నియమించారు.