హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
వీబీజీ-రాంజీ పేరుతో కేంద్రం తీసుకొస్తున్న కొత్తవిధానం పేదల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ, జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరమని మండిపడ్డారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.