ఖమ్మం రూరల్, జూలై 27 : ఖమ్మం రూరల్ మండలంలో గల ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం “శ్రీనివాస మంగాపురం” మూవీ ప్రమోషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు గట్టమనేని జయకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతి కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. చిత్ర విశేషాలను పంచుకుంటూ సినిమా విజయవంతం కావడానికి విద్యార్థుల ఆశీర్వాదాలు, సహకారం కోరారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు ముఖ్య అతిథులను ఘనంగా ఆహ్వానిస్తూ, యువతకు నాణ్యమైన వినోదంతో పాటు విలువలను అందించే చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సినీ ప్రముఖులతో ప్రత్యక్షంగా మమేకం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బత్తుల గోపాల్, అకాడమిక్ డైరెక్టర్ ఆట్లూరి వెంకటరమణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో “శ్రీనివాస మంగాపురం” సినిమా ప్రమోషన్