హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పత్తి పంటను ధ్వంసం చేస్తున్న గులాబీబోల్ వార్మ్ను నియంత్రించే టెక్నాలజీని లక్నోలో జాతీయ బొటానికల్ పరిశోధనా సంస్థ కనుగొనటం గొప్ప విషయమని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు. నిరుడు మోనోసాంటో బీటీవన్, బీటీటు టెక్నాలజీతో విత్తనాలను తయారు చేసి.. ఆకును తినే పురుగుతోపాటు పత్తిని దెబ్బతీసే పురుగును నియంత్రించగలిగిందని గుర్తుచేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విత్తనాలు తయారుచేసి.. తక్కువ ధరలకు విక్రయించాలని ఆమె సూచించా రు. అందుకు వ్యవసాయశాఖ మంత్రి చొరవచూపాలని కోరారు.
10 వరకు పీఎం కుసుమ్కు దరఖాస్తులు
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ స్కీంలో సోలార్ ప్లాంట్ల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్టు రెడ్కో వీసీ అండ్ ఎండీ అనీల తెలిపారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వివరాలకు www.pmkusum. telangana. gov. in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. అయితే పీఎం కుసుమ్ స్కీం కింద 4వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంట్లో వెయ్యి మెగావాట్లు మహిళా సంఘాలకు కేటాయించగా, మరో మూడు వేల మెగావాట్లు రైతులకు కేటాయించారు.