Medaram | తాడ్వాయి : మండలంలోని మేడారంలో ఆదివారం సమ్మక్క సారలమ్మల పూజారులు విత్తన పండుగను నిర్వహించనున్నారు. వేకువజామున డోలు వాయిద్యాలు నడుమ గ్రామ సమీప అడవిలోకి పూజారులు వారి కుటుంబ సభ్యులు కలిసి వనభోజనాలకు తరలి వెళ్తారు. అనంతరం ప్రకృతి దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం ఎండిన ఇప్ప పూలను ఎరుపు రంగు గుడ్డలో కట్టి ఒక చెట్టుకు కడతారు. అనంతరం కార్తెలను గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. వీటికి అనుగుణంగా పూజారులు విత్తనాలు నాటుకోవడం, కూరగాయల సాగు చేయడం తదితర కార్యక్రమాలను ఈ కార్తెలను అనుసరించి చేపట్టనున్నారు. వచ్చే ఏడు ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహా జాతర తేదీలను కూడా నిర్ణయించనున్నారు.