హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు (Minister Srinivas goud) భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ విభాగం నిర్ణయించింది. ఇటీవల హత్య కుట్రకోణం బయట పడటంతో ఆయనకు భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు పైలట్ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఒక పైలట్ సహా పది మంది సెక్యూరిటీ ఉండేవారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు రూ.15 కోట్ల డీల్ జరిగినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయడంతోపాటు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. వ్యాపారాలతో పాటు ఆర్థికంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తనను.. దెబ్బతీసినందునే హత్యకు పథకం వేశామని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.