హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు బోగీలను చేర్చింది. ప్రస్తుతం 16 బోగీలుండగా 20కి పెంచినట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుతం మొత్తం 1128 సీట్లు ఉండగా అదనపు బోగీల జోడింపుతో సీట్ల సంఖ్య 1440 వరకు పెరిగిందని తెలిపారు.