పెబ్బేరు, జూన్ 30 : రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పేదల కోసం మెరుగైన విద్యావైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నాణ్యమైన విద్యను, దవాఖానల్లో రోగులకు మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.