హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. సచివాలయం, అసెంబ్లీ, లోక్‌భవన్ ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, బ్మాడ్మింటన్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలు నిర్వహించనున్నారు.