హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం తాజ్‌మహల్ కంటే సుందరంగా కనిపిస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో అన్ని దేవాలయాలతోపాటు మసీదు కూడా నిర్మిస్తున్నారని, కేసీఆర్ మత సామరస్యానికి థ్యాంక్స్ చెప్పాల్సిందేనన్నారు. రోడ్డుపై నుంచి సెక్రటేరియట్‌ను చూస్తుంటే గర్వంగా ఉన్నదని చెప్పారు.
ఇలాంటి అద్భుత కట్టడం దేశంలో ఎక్కడాలేదన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని చెప్పారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతున్నదని, అది దేశమంతా అమలు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాని తెలిపారు.