మహోగ్ర గోదావరి.. చరిత్రలో రెండోసారి భద్రాద్రి వారధిపై వాహనాలకు బ్రేక్..!
హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాయంత్రం 5 గంటలకు 61.80 అడుగులకు చేరింది. 1976 నుంచి నది 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి వంతెనను మూసివేశారు.

భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. అయితే, భద్రాచలం వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారి. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆంక్షలు అమలులోకి రాగా.. 48 గంటల పాటు కొనసాగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

