హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పురపాలక ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యపై గందరగోళం నెలకొన్నది. ఒక పక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఒక జాబితాను విడుదల చేయగా, దానికి భిన్నంగా పురపాలకశాఖ మరో సంఖ్య ను తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. 123 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని 2,996 వార్డులకు 29,694 నామినేష న్లు దాఖలయ్యాయని ఎస్ఈసీ వార్డులవారీ గా శనివారం ఉదయం జాబితా విడుదలచేసింది. మధ్యాహ్నం పురపాలకశాఖ మరో జా బితాను విడుదల చేస్తూ మొత్తం 29,742 నామినేషన్లు దాఖలైనట్టు పార్టీలవారీగా ప్రకటించింది. రెండు జాబితాల మధ్య 48 నామినేషన్లు తేడా వస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నిక ల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిది కాగా, షెడ్యూల్ మొదలు, నోటిఫికేషన్ ఇతర అన్ని అంశాలను రాజ్యాంగ సంస్థనే ప ర్యవేక్షిస్తున్నది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంలో కూడా అన్నీ ఎస్ఈసీనే చూసుకున్నది. ఎక్కడా పంచాయతీ రాజ్‌శాఖ జోక్యం చేసుకోలేదు. కానీ, ఇప్పుడు మున్సిప ల్ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యను మాత్రం రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేకంగా విడుదల చేయడం అనుమానాలకు తావిస్తున్నది. అసలు ఈ రెండు విభాగాల మధ్య నంబర్ల యుద్ధం ఎందుకు మొదలైంది? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? సమన్వ యం లోపించిందా? ఆ శాఖను పర్యవేక్షించే ముఖ్యమంత్రే ఈ పనిచేయాలని ఆదేశించారా? నామినేషన్ల జాబితాలు రెండు విడుదల చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ ఇచ్చే గణాంకాలే అంతిమం. కానీ, మున్సిపల్ నామినేషన్ల విషయంలో ఎస్ఈసీ, పురపాలక శాఖలు వేర్వేరు వివరాలు వెల్లడించాయి. 29,694 నామినేషన్లు దాఖలైనట్టు ఎస్ఈసీ వెల్లడించగా, 29,742 దాఖలైనట్టు పురపాలక శాఖ పేర్కొన్నది. అదనంగా సీపీఐ, జనసేన, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీల నుంచి దాఖలైన నామినేషన్ల వివరాలను కూడా పురపాలకశాఖ గణాంకాల్లో వెల్లడించింది. ఈ రెండింటి సంఖ్యలో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఒకే అభ్యర్థి బహుళ నామినేషన్లు వేయడం, కొన్ని చోట్ల సాంకేతిక లోపాలు ఈ గందరగోళానికి కారణమని అధికారులు చెప్తున్నా, రాజకీయ వర్గాల్లో మాత్రం అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పురపాలక శాఖ ప్రత్యేకంగా నామినేషన్ల జాబితాను సిద్ధం చేయడం వెనుక ఉన్న వ్యూ హంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ నుంచి ఎన్ని నామినేష న్లు పడ్డాయి? తిరుగుబాటు అభ్యర్థులు ఎక డ బలంగా ఉన్నారు? అనే అంశాలను విశ్లేషించడానికే ఈ సమాంతర వ్యవస్థ నడుస్తున్న దా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? విపక్షాల బలం ఎకడ ఎకువగా ఉందో అంచనా వేసేందుకే ఈ జాబితానా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక శాఖ స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండటంతో, ప్రభుత్వ యంత్రాంగం ఈ ఎన్నికల ప్రక్రియలో అతిగా జోక్యం చేసుకుంటున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.