మహబూబాబాద్ రూరల్, జూన్ 18 : కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం ఏసీబీ అధికారులకు దొరికాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం ఓ కాంట్రాక్టర్‌కు రూ. 20 లక్షల వరకు వర్క్స్ చేసేందుకు లిమిట్ ఉందని, ఇంకా పనులు చేపట్టేందుకు అనుమతి కోరగా సంబంధిత ఏఈ, డీఈలు సమ్మతించి, ఫైల్‌ను ఎస్ఈ నరేశ్‌కు పంపారు.
కాంట్రాక్టర్ ఎస్ఈని కలువగా రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఈ నెల 14న రూ. 20 వేలు తీసుకున్నాడు. బుధవారం 80వేలు తీసుకుంటూ దొరికాడు.