నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో కాకతీయుల కాలం నాటి అరుదైన శిల్పం శనివారం వెలుగులోకి వచ్చింది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి చరిత్ర ఆనవాళ్ల కోసం సురభి రాజుల సంస్థానంలో అన్వేషించారు.
ఎల్లూరు జీపీ కార్యాలయ ఆవరణంలో ఉన్న విగ్రహాన్ని పరిశోధించగా కాకతీయుల కాలం నాటి వీరగల్లు ఆనవాళ్లు కనిపించడంతో కాకతీయుల కాలం నాటి శిల్పంగా గుర్తించారు. శిల్పంపై ఒక వైపు చెన్నకేశవుడు మరో వైపు యుద్ధ దృశ్యాలు, నాల్గోవైపు ఒక స్త్రీ ఆత్మహత్య దృశ్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటి అరుదైన శిల్పాన్ని జాగ్రత్తగా కాపాడుతున్న స్థానికులను అభినందించారు.
– కొల్లాపూర్