SCR | ప్రయాణికులకు ముఖ్యగమనిక.. ఈ నెలాఖరు వరకు 52 రైళ్లు రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
హైదరాబాద్: ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది. ఇందులో జన్మభూమి (Janmabhoomi) ఎక్స్ప్రెస్, గరీబ్రథ్తోపాటు (Garib Rath) విశాఖ-చెన్నై, తిరుపతి-భువనేశ్వర్, హైదరాబాద్-కటక్ మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గుండాలా-విజయవాడ సెక్షన్ పరిధిలో నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
రద్దయిన రైళ్లు ఇవే..
హైదరాబాద్- విశాఖపట్నం మార్గంలో.. జన్మభూమి(12805-12806), గరీబ్రథ్ (12739-12740), రాజమండ్రి-విజయవాడ-రాజమండ్రి (07767/68), విజయవాడ-రాజమండ్రి-విజయవాడ (07459/60) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 23 వరకు కటక్-హైదరాబాద్ (07166) రైలును రద్దు చేశారు. ఈనెల 27 వరకు కాకినాడ టౌన్-లింగంపల్లి (12775), లింగపల్లి-కాకినాడ టౌన్ (12776), విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (12783/84) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 29 వరకు విశాఖపట్నం-లింగంపల్లి (12805), విశాఖపట్నం-మహబూబ్నగర్ (12861) , 30వ తేదీ వరకు లింగంపల్లి-విశాఖపట్నం (12806), మహబూబ్నగర్-విశాఖపట్నం (12862) రైళ్లను రద్దు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

