హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : 2025-26 విద్యాసంవత్సరంలో 210 సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్‌ను ప్రారంభించేందుకు అనుమతిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించే విషయంలో సర్కారు, విద్యాశాఖ తీవ్ర ఆలస్యం చేశాయని, బడిబాట సమయంలోనే అడ్మిషన్లు స్వీకరించేవారమని ఓ టీచర్ వాపోయారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్‌టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారి హాల్‌టికెట్లను అధికారులు వెబ్సైట్లో విడుదల చేశారు. అభ్యర్థులు https://tgtet.aptonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించి అమలుచేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య బుధవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి జిల్లాకు జవహార్ నవోదయ విద్యాలయాన్ని నెలకొల్పాలని, సీపీఎప్ను రద్దుచేయాలని కోరారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో సింగరేణి సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది. బుధవారం సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అండ్ ఎండీ అశోక్‌చంద్ర పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు పున:ప్రారంభమయ్యాయి. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలిరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ‘ఎగ్ బిర్యానీ’ని అందించారు. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా కేంద్రాల్లో అడ్మిషన్లు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. ‘అమ్మమాట-అంగన్వాడీ బాట’ పేరుతో గ్రామాల వారీగా ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి, సభ్యులు కేంద్రాలను సందర్శించారు.