హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : దసరా సెలవుల అనంతరం రాష్ట్రంలోని బడులు శనివారం పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, మాడల్, కేజీబీవీ స్కూళ్లు, గురుకులాలు తెరుచుకోగా, ప్రైవేట్ స్కూళ్లు తెరుచుకోలేదు. తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మాడల్ స్కూల్స్లో విద్యార్థుల హాజరు 5-10% లోపే ఉంది. మెదక్ జిల్లాలోని ఓ స్కూల్లో 490 మంది విద్యార్థులకు 13 మంది హాజరయ్యారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి విద్యార్థులు పూర్తిస్థాయిలో బడిబాట పట్టనున్నారు.