కౌటాల, ఆగస్టు 27 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడంలేదు. కేబీ కాలనీ మొగడ్‌ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. గురుడుపేట గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెడికల్ లీవ్‌లో ఉండటంతో 5 గిరిజన పా ఠశాలలు మూతపడ్డాయి. రోజూ విద్యార్థులు పాఠశాలకు వచ్చి.. ఉపాధ్యాయు లు లేక తిరిగి వెళ్తున్నారు. ఎస్సీఆర్పీ మడావి పోచానిని వివరణ కోరగా, ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో పాఠశాలలు నడవడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం, సిరిసిల్లకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికైనట్టు కేంద్ర విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 50 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 5న వీరందరికీ న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జడ్పీహెచ్‌ఎస్‌లోని ప్ర భుత్వ ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జడ్పీహెచ్‌ఎస్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాండూరి సంపత్‌కుమార్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
మిషన్ శక్తి పాలన పథకంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌లోని మారండే య కాలనీ అంగన్వాడీలోని శిశువిహార్‌లో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తన కూతురు ఫరాను ఇటీవల చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన శిశు విహార్ కేంద్రానికి సందర్శించారు. – ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్